AJTIH : అదిరే మాస్ లుక్‌లో అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.
యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో భారీగా ఆసక్తిని రేపింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు.
'విదాముయార్చి'తో నిరాశ చెందిన అజిత్ అభిమానులకు గుడ్ బ్యాడ్ అగ్లీ భారీ హిట్ అందిస్తుందని అంచనాలు పెరిగాయి.
'మార్క్ ఆంటోని' విజయం తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు.
Details
ఈనెల 28న టీజర్ రిలీజ్
సినిమా టీజర్‌కు సంబంధించి మేకర్స్ ఓ అఫీషియల్ వీడియో విడుదల చేశారు. ఈ నెల 28న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ విడుదల కానుంది. ఈ సినిమాలో త్రిష ఫీమేల్ లీడ్‌లో నటిస్తోంది.
త్రిష - అజిత్ కాంబోపై భారీ క్రేజ్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిచారు.
వేసవి బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నిలవనుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.