
Ajith Kumar: కేవలం 10 రోజుల్లో రూ.200 కోట్ల వసూలు.. మరోసారి సత్తా చాటిన అజిత్ కుమార్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా రంగంలో అగ్రగామిగా నిలిచిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమ విస్తృతిని తమిళ సినీ పరిశ్రమలోకి తీసుకెళ్లింది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా, యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(GBU)తో కోలీవుడ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టారు.
ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలైన వెంటనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌ను ఈ సినిమా దాటింది. ఇది కేవలం 10 రోజుల్లోనే సాధించిన ఘనత.
Details
రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమా ఇదే
అజిత్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన పొందుతూ, థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డ్స్‌తో దూసుకుపోతోంది.
అదేకాలంలో తమిళ స్టార్ విజయ్ నటించిన 'గోట్' సినిమా నార్త్ అమెరికా కలెక్షన్లను గుడ్ బ్యాడ్ అగ్లీ అధిగమించింది.
ఇది అజిత్ సినిమాకు వచ్చిన పాన్-ఇండియా స్థాయిలోని ఆదరణకు నిదర్శనం.
కేరళలో మొదటి వారం కేవలం కొన్ని స్క్రీన్లతోనే విడుదలైన ఈ సినిమాకు రెండవ వారం ప్రారంభానికి ముందే 200 థియేటర్లను అదనంగా కేటాయించారు. ఇది సినిమా విజయాన్ని స్పష్టంగా చాటిచెబుతుంది.
వర్కింగ్ డేస్‌ల్లోనూ స్టడీ కలెక్షన్స్ సాధిస్తుండగా, వీకెండ్స్‌లో హౌస్‌ఫుల్ షోలతో దుమ్మురేపుతోంది. విశ్వాసం సినిమా తర్వాత అజిత్ కెరీర్‌లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన రెండవ సినిమా ఇదే.