Page Loader
Good Bad Ugly : 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్ విడుదల .. యాక్షన్ అదరగొట్టిన అజిత్ ..

Good Bad Ugly : 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్ విడుదల .. యాక్షన్ అదరగొట్టిన అజిత్ ..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, దర్శకత్వ బాధ్యతలను అధిక్ రవిచంద్రన్ స్వీకరించారు. అజిత్‌కు జోడిగా త్రిష ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రారంభంలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రం, వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా "గుడ్ బ్యాడ్ అగ్లీ" ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. మీరు కూడా ఈ ట్రైలర్‌ని తప్పకుండా చూసేయండి. ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ గా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్ విడుదల