Magizh Thirumeni: అజిత్‌కి ఉన్న ఈ స్కిల్స్ గురించి మీకు తెలుసా..? మగిజ్ తిరుమేని చెప్పిన ఆసక్తికర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.
ఇందులో ఒకటి ఏకే 62 పేరుతో వస్తున్న విదాముయార్చి (Vidaa Muyarchi).ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది తెలుగులో 'పట్టుదల' అనే టైటిల్‌తో విడుదల కానుంది.
అజిత్ కుమార్ తన సినిమాలతో అభిమానులకు వినోదాన్ని అందించడమే కాకుండా, తన మల్టీ టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు.
వివరాలు
దుబాయ్‌లో కార్ రేసింగ్ ఈవెంట్‌లో మూడో స్థానంలో..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మగిజ్ తిరుమేని అజిత్ కుమార్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల అజిత్ కుమార్ టీం దుబాయ్‌లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మగిజ్ తిరుమేని అజిత్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అజిత్ కుమార్ మనకు నటుడిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన బైకర్, కార్ రేసర్ మాత్రమే కాకుండా మరెన్నో రంగాల్లో నిపుణుడు.
ఆయన ఫొటోగ్రఫీలో గొప్ప ప్రావీణ్యం కలిగి ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలలో ఆయన తీసిన ఫొటోలు అనేక బహుమతులు గెలుచుకున్నాయి.
వివరాలు
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఏకే 63
అంతేకాదు, రైఫిల్ షూటింగ్ పోటీలలో కూడా బహుమతులు గెలుచుకున్నారు.
ఆయనతో పోటీపడేవాళ్లు ఆటలో గెలవాలంటే చాలా కష్టపడుతారు.కానీ అజిత్ షూటింగ్ ముగిసిన తర్వాత వెళ్లి నేరుగా బహుమతి గెలుచుకుంటారు. ఇదే ఆయనకు అన్ని విజయాలను అందించే ప్రత్యేకత అని మగిజ్ తిరుమేని పేర్కొన్నారు.
అజిత్ నైపుణ్యాలు అనేక మందికి స్పూర్తిని అందిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్నఈచిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్ర పోషిస్తున్నారు.
రెజీనా కసాండ్రా,ఆరవ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.మరోవైపు,అజిత్ కుమార్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఏకే 63 అనే మరో సినిమా కూడా చేస్తున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.