Chiranjeevi- Nagarjuna: చిరంజీవిని కలిసిన నాగార్జున.. ఎందుకంటే?
ఈ నెల (అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకలో హాజరు కావాలని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. చిరంజీవితో పాటు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నారని నాగార్జున తెలిపారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ చిత్రకారులను తన పేరుతో జాతీయ అవార్డులు ఇచ్చి సత్కరించాలని అక్కినేని నాగేశ్వరరావు 2006లో ఏఎన్నార్ అవార్డులను ప్రారంభించారు. 2014లో, రెండు సంవత్సరాల తర్వాత, అమితాబ్ బచ్చన్‌కు ఈ అవార్డు అందించారు. ఆ తరువాత, మళ్లీ రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత 2016లో జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరికి ఈ అవార్డు అందజేశారు.
అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డు
ఆ తర్వాత రాజమౌళి, శ్రీదేవి, రేఖలకు కూడా ఈ అవార్డులు అందించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత, తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందించనున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో జరిగే ఈ వేడుకలో, చిరంజీవి ఈ అవార్డును అమితాబ్ చేతుల మీదుగా అందుకోనున్నారు.