Page Loader
అల్లరి నరేష్, ఫారియా అబ్ధుల్లా కాంబినేషన్‌లో కొత్త మూవీ
క్లాప్ కొడుతున్న రామానాయుడు

అల్లరి నరేష్, ఫారియా అబ్ధుల్లా కాంబినేషన్‌లో కొత్త మూవీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2023
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాంది సినిమా తర్వాత హీరో అల్లరి నరేష్ రూట్ మార్చేశాడు. ఈ టాలెండెట్ హీరో ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమా అప్‌డేట్ అందించాడు. అల్లరి నరేష్ తొలిసారిగా మల్లి అంకంతో సినిమా చేయనున్నాడు. ఇది పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. చాలా గ్యాప్ తర్వాత నరేష్ ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో నటించడం విశేషం. ఇంకా సినిమా టైటిల్‌ని ఖారారు చేయలేదు. అయితే తాజాగా ఓ క్రేజీ ఆప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథానాయకగా ఫారియా అబ్దుల్లాను ఖారారు చేశారు. జాతిరత్నాలు సినిమాలో ఫారియా అబ్దుల్లాను తన కామెడీతో ఎంతగానో అకట్టుకున్న విషయం తెలిసిందే.

అల్లరి నరేష్

వైవిధ్యమైన కథతో వస్తున్న అల్లరి నరేష్

ప్రస్తుతం అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ క్రేజీగా ఉండనున్నట్లు సమాచారం. ఇది రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాదని, ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు మల్లి అంకం స్పష్టం చేశారు. చిలకా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నాడు. త్వరలోనే ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కు సంబంధించి పూజా కార్యక్రమాలను నేడు రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. హీరో, హీరోయిన్‌గా అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా నటిస్తుండటంతో ఈ సినిమా అంచనాలు భారీగానే పెరిగాయి.