మధు మంతెన పెళ్ళి వేడుకకు హాజరైన అల్లు అర్జున్, హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్; వైరల్ అవుతున్న ఫోటోలు
బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, యోగా గురువు ఐరా త్రివేదిల వివాహం ఆదివారం రోజు ముంబైలో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. తెలుగు సినిమా నుండి అల్లు అర్జున్ అతిథిగా వెళ్లారు. పెళ్ళి వేడుకలో హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్ లకు కలుసుకున్న అల్లు అర్జున్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. హృతిక్ రోషన్ ని ఆప్యాయంగా హగ్ చేసుకున్న అల్లు అర్జున్ ఫోటోలు సోషల్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకే ఫ్రేములో అల్లు అర్జున్, ఆమీర్ ఖాన్, హృతిక్ రోషన్ కనిపించడంతో అభిమానులు ఎక్సైట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలకు కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి.
మల్టీస్టారర్ కావాలంటున్న నెటిజన్లు
ప్రస్తుతం ఈ ఫోటోలకు కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. భారతీయ సినిమారంగంలో చెప్పుకోదగ్గర ఇద్దరు డ్యాన్సర్లు ఒకే ఫ్రేములో కనిపించడం అద్భుతంగా ఉందని అంటున్నారు. అల్లు అర్జున్, హృతిక్ రోషన్ లతో ఒకపాట గానీ, ఒక సినిమాగానీ చేస్తే బాగుంటుందని ఇంకొందరు కామెంట్ చేసారు. భారతీయ సినిమా స్టార్లు ముగ్గురు ఒకే ఫ్రేములో కనిపించడం బాగుందని మరికొందరు వ్యాఖ్యానించారు. అదలా ఉంచితే, గజిని, అగ్లీ, క్వీన్ చిత్రాలను నిర్మించిన మధు మంతెన, గతంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబాను మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు. మసాబాతో పెళ్ళికి ముందు నందనా సేన్ అనే నటితో రిలేషన్ లో ఉన్నాడు.