Loading...
Allu Arjun Boyapati: పౌరాణిక చిత్రానికి రెడీ అవుతున్న బన్నీ...పదేళ్ల తరువాత ఆ కాంబినేషన్
పౌరాణిక చిత్రానికి రెడీ అవుతున్న బన్నీ...పదేళ్ల తరువాత ఆ కాంబినేషన్

Allu Arjun Boyapati: పౌరాణిక చిత్రానికి రెడీ అవుతున్న బన్నీ...పదేళ్ల తరువాత ఆ కాంబినేషన్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను.. ఈ రెండు పేర్లు కలిస్తే 'సరైనోడు' గుర్తుకు రావడం సహజమే. 2016లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి మాత్రం బన్నీ కోసం బోయపాటి ఎంచుకున్న కథ సాధారణ మాస్ కమర్షియల్ సినిమా కాదట. పూర్తిస్థాయి పౌరాణిక నేపథ్యంతో రూపొందే ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది.

Details

బన్నీ కెరీర్‌లోనే కొత్త జానర్

అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రల్లో కనిపించినా.. పౌరాణిక కథలో మాత్రం నటించలేదు.

ఈ నేపథ్యంలో బోయపాటి చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కథలోని కాన్సెప్ట్, పాత్రలోని వైవిధ్యం నచ్చడంతోనే బన్నీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీతో ఓ మైథలాజికల్ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఆ జానర్‌లో బన్నీని తెరపై చూపించే అవకాశం బోయపాటికి దక్కినట్లు తెలుస్తోంది.

Details

మళ్లీ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పైనే

ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నట్లు సమాచారం.

'సరైనోడు'ను కూడా ఇదే బ్యానర్‌పై నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

పౌరాణిక కథ కావడంతో భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.

దీంతో బన్నీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

ADVERTISEMENT

Details

బన్నీ లైనప్‌లో మరో భారీ సినిమా

ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో 'రాకా'లో నటిస్తున్న ఆయన.. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. పౌరాణిక కథలకు ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆదరణకు తోడు బన్నీ స్టార్ ఇమేజ్, బోయపాటి మాస్ టేకింగ్ కలిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇప్పటికే మొదలైంది.

ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

ADVERTISEMENT