Allu Arjun: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్.. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్
అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు గత నెల 11న పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు.సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం సర్వత్రా చర్చకు గురయ్యింది. పుష్ప సినిమా ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు చేరుకున్నాడని, దీనితో భారీగా అభిమానులు అక్కడ చేరుకుని తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. అదృష్టవశాత్తు, ఆ బాలుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు, తమకు ముందుగా సరైన సమాచారం అందించలేదని ఆరోపిస్తున్నారు.
అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్
అల్లు అర్జున్ వ్యవహారం పై తెలంగాణ ముఖ్యమంత్రి
అల్లు అర్జున్‌ను ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపరచడం వరకు పరిస్థితులు ఉత్కంఠతో సాగాయి. ఈ పరిణామాలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవైపు, అల్లు అర్జున్ వ్యవహారం పై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు. చట్టం ముందే అందరూ సమానులేనని, ఈ వ్యవహారంలో చట్టం తన విధి నెరవేర్చుకుంటుందని చెప్పారు. తన జోక్యం ఇందులో లేదని ఆయన స్పష్టం చేశారు.