Page Loader
Pushpa 2: రెడీ అవుతున్న పుష్ప 2 రెండో టీజర్ ? 
Pushpa 2: రెడీ అవుతున్న పుష్ప 2 రెండో టీజర్ ?

Pushpa 2: రెడీ అవుతున్న పుష్ప 2 రెండో టీజర్ ? 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2024
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ 'పుష్ప 2'పై భారీ బజ్ ఉంది. ఎక్కడ చూసినా పుష్ప రాజ్ గురించే మాట్లాడుకుంటున్నారు.ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. రీసెంట్‌గా అల్లు అర్జున్ పుట్టినరోజున విడుదలైన టీజర్‌ 24గంటల్లోనే ఎన్నో పెద్ద రికార్డులను బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించగా, మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. నిజానికి ఇందులో అల్లు అర్జున్ డిఫరెంట్ స్టైల్లో కనిపించాడు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం పెద్ద లోటు అయితే,టీజ‌ర్ కూడా హడావుడిగా క‌ట్ చేసిన‌ట్టు అనిపించింది. ఫోక‌స్ అంతా గంగ‌మ్మ జాత‌ర‌పైనే పెట్టారు. మిగిలిన క్యారెక్ట‌ర్ల‌ని ఏమాత్రం ప‌రిచ‌యం చేయ‌లేదు. 'పుష్ప 2' టీజర్ ను రెండు వెర్ష‌న్ల‌లో క‌ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Details 

'పుష్ప 2' నిర్మాతలు భారీ ప్రణాళిక ! 

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ లో గంగ‌మ్మ జాత‌ర‌ సెట‌ప్ఉంటే ..రెండోది మిగిలిన ఫుటేజ్‌తో క‌ట్ చేశారు. ఆ టీజ‌ర్‌లో పుష్ష ప్రపంచాన్ని మొత్తం చూపించారు.అయితే.. బ‌న్నీపుట్టిన రోజున‌,బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ని మాత్ర‌మే హైలెట్ చేయాల‌న్న ఉద్దేశంతో గంగ‌మ్మ జాత‌ర టీజ‌ర్ విడుదల చేశారు. ఇప్పుడు రెండో టీజ‌ర్ కూడా రెడీగానే ఉందని దాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నారు మేకర్స్. దీనితో పాటు'పుష్ప: ది రూల్' లిరికల్ సాంగ్ కూడా సిద్ధమైంది. త్వరలోనే పాటల్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అల్లు అర్జున్ కూడా 'పుష్ప 2' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.అయితే రెండో టీజర్ ఎప్పుడు వస్తుందా? తేదీకి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.