Allu Arjun: పోలీసుల అనుమతితో నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
35 రోజులుగా కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజు, మైత్రి మూవీస్ నిర్మాతలు, పలువురు సినీ ప్రముఖులు శ్రీ తేజని పరామర్శించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీ తేజని పరామర్శించనున్నారు.
గతంలో శ్రీ తేజని పరామర్శించేందుకు ప్రయత్నించిన అల్లు అర్జున్, పోలీసుల సూచనల మేరకు రావడాన్ని వాయిదా వేసుకున్నారు.
Details
గంటలోపే పూర్తిచేయడానికి ప్రయత్నాలు
అయితే ఈసారి పోలీసుల ప్రత్యేక అనుమతి, షరతులతో ఆయన ఆస్పత్రికి రానున్నారు.
అల్లు అర్జున్ పరామర్శ విషయం రహస్యంగా ఉంచి, ఈ కార్యక్రమాన్ని గంటలోపే పూర్తి చేయాలని పోలీసులు సూచించారు.
అల్లు అర్జున్‌తో పాటు పుష్ప - 2 నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే శ్రీ తేజ తండ్రికి రూ. 2 కోట్ల చెక్ అందజేశారు.
నేడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి రానున్న నేపథ్యంలో, ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.