Page Loader
AlluArjun: అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. ఏంటంటే..?
అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. ఏంటంటే..?

AlluArjun: అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. ఏంటంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ అందింది. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ కొత్త సినిమాను చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సన్ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందనుంది.ఈ విషయం వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ అల్లు అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. 'పుష్ప' సినిమాతో జాతీయ అవార్డు అందుకొని అల్లు అర్జున్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా సీక్వెల్‌ కూడా భారీ విజయం సాధించడంతో,ఆయన తదుపరి సినిమా ఏమై ఉంటుందా అని ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ ఓ ప్రాజెక్ట్‌ చేయబోతున్నారన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని సన్ పిక్చర్స్‌ అధికారికంగా ధృవీకరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సన్ పిక్చర్స్ చేసిన ట్వీట్