Loading...
Amitabh Bachchan: జీవితంలో ఏది ఎక్కువైనా ఇబ్బందే...అమితాబ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
జీవితంలో ఏది ఎక్కువైనా ఇబ్బందే...అమితాబ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

Amitabh Bachchan: జీవితంలో ఏది ఎక్కువైనా ఇబ్బందే...అమితాబ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా తన బ్లాగ్‌లో చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జీవితంలో ఏమీ లేనప్పుడు చాలా కావాలని కోరుకుంటామని, తీరా కోరుకున్నదానికంటే ఎక్కువగా లభిస్తే వాటన్నింటినీ ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడతామని ఆయన చెప్పుకొచ్చారు. సాధారణ జీవిత సత్యంలా అనిపించే ఈ మాటలు.. ప్రస్తుతం అమితాబ్‌ కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదం నేపథ్యంలో రావడంతో బాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి.

Details

కోరుకున్నది దొరికినా కొత్త సమస్యే

తన బ్లాగ్‌లో అమితాబ్‌ మనిషి ఆలోచనా విధానాన్ని ప్రస్తావిస్తూ.. ఏమీ లేనప్పుడు దేవుడిని ఎన్నో విషయాలు కోరుకుంటామని, అన్నీ సమకూరిన తర్వాత మాత్రం ఇంత ఎక్కువ ఎందుకు వచ్చాయి? వీటిని ఏం చేసుకోవాలి? అనే ఆలోచన మొదలవుతుందని వివరించారు.

ప్రపంచం మనం అనుకున్న విధంగా ఎప్పుడూ నడవదని కూడా ఆయన చమత్కరించారు. కాలంతో కలిసి ముందుకు సాగినప్పుడే జీవితంలో విజయాన్ని అందుకోగలమనే భావనను తన మాటల్లో వ్యక్తం చేశారు.

Details

'జల్సా' చుట్టూ కొనసాగుతున్న వివాదం

అమితాబ్‌ ముంబయి నివాసం 'జల్సా' యాజమాన్యంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది.

అమితాబ్‌ సోదరుడు అజితాబ్‌ బచ్చన్‌ భార్య రమోలా ఈ ఆస్తిపై న్యాయపోరాటం చేస్తున్నట్లు సమాచారం.

1993లో ఈ బంగ్లాను గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా జయా బచ్చన్‌ పేరుకు బదిలీ చేశారని, అయితే అంతకుముందు ఆస్తి తన పేరులోనే ఉందని రమోలా వాదిస్తున్నారు.

తన అనుమతి లేకుండా బదిలీ జరిగిందని ఆమె అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

Details

రెమ్యునరేషన్‌తో కొనుగోలు చేసిన బంగ్లా

'జల్సా'కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. 1982లో ఓ సినిమా రెమ్యునరేషన్‌కు బదులుగా అమితాబ్‌ ఈ బంగ్లాను నిర్మాత ఎస్‌.సి. సిప్పీ నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా నవంబర్‌ 1న అమితాబ్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ షీల్డ్‌ వెనుక ఉండి అభిమానులను కలిసిన దృశ్యాలు కూడా వైరల్‌ అయ్యాయి.

బాలీవుడ్‌ నటులపై దాడుల బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతను పెంచినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల మధ్య అమితాబ్‌ చేసిన "అన్నీ లభించినా ఇబ్బందే" అనే వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

ADVERTISEMENT