Amitabh Kalki Glimpse : 'కల్కి 2898 AD'.. అశ్వత్థామగా 'అమితాబ్'
KKR, RCB మధ్య ఆదివారం ఉత్కంఠభరితమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ తర్వాత, 'కల్కి 2898 AD' నిర్మాతలు అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ 'అశ్వత్థామ'గా కనపడబోతున్నట్టు తెలిపారు. KKR vs RCB మ్యాచ్ ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమైన 21-సెకన్ల ప్రోమో వీడియోలో గుబురు గడ్డం..పాత దుస్తులు..మొహం కనిపించకుండా కళ్లు మాత్రమే కనిపిస్తున్న అమితాబ్ లుక్ బాగుంది. అమితాబ్ బచ్చన్ ఒక గుహలో, శివ లింగానికి ప్రార్థనలు చేయడంతో ప్రారంభమవుతుంది. మైల్డ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా .. "నువ్వు చావకుండా ఉంటావా? నువ్వు దైవానివా ? నువ్వు ఎవరు?" అని ప్రశ్నిస్తున్న పిల్లవాడి గొంతు వినబడుతుంది.
జూన్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్
దీనికి బిగ్ బి ,"ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తునాన్ను, నేను గురు ద్రోణుడి కొడుకుని. అశ్వత్థామ" అని జవాబు ఇస్తాడు. అంతకుముందు, కల్కి 2898 AD బృందం చిత్రం నుండి బిగ్ బి పాత్ర పోస్టర్‌ను షేర్ చేసింది."అతను ఎవరో తెలుసుకునే సమయం వచ్చింది" అని రాసింది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా అమితాబ్ అశ్వథ్థామ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం 'కల్కి 2898 AD' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.