Epic: సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ఆనంద్ దేవరకొండ 'ఎపిక్'
ఈ వార్తాకథనం ఏంటి
యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్' విడుదలకు సిద్ధమవుతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని హీరో ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్‌ను బట్టి చూస్తే కథ యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) నేపథ్యంతో సాగనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి..
ఇందులో ఆదిత్య అనే షార్ట్ ఫిల్మ్ దర్శకుడి పాత్రలో ఆనంద్ దేవరకొండ కనిపించనుండగా, కడలి పాత్రలో వైష్ణవి చైతన్య నటిస్తోంది.
బోర్న్‌మత్ యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లిన ఓ మధ్యతరగతి యువకుడి జీవితంలో చోటుచేసుకునే ప్రేమకథను ఈ సినిమా ఆవిష్కరించనుంది.
టీజర్‌లోని ఒక సరదా సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
తన ప్రేయసితో గదిలో ఉన్న సమయంలో ఇండియా నుంచి తల్లిదండ్రులు వీడియో కాల్ చేయడం, షర్ట్ లేకుండా కనిపించిన కుమారుడిని తండ్రి పాత్రలో నటించిన శివాజీ మందలించడం, దానికి ఆదిత్య తాను వర్కౌట్ చేస్తున్నానంటూ చెప్పే సమాధానం నవ్వులు పంచింది.
ఈ సన్నివేశం సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
వివరాలు
మూవీ నిర్మిస్తున్నది ఎవరంటే?
ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తుండగా, అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్‌ను నవీన్ నూలి చేపట్టారు.