Loading...
Anirudh Kavya Wedding Greece: అనిరుధ్‌-కావ్యా.. గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?
అనిరుధ్‌-కావ్యా.. గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

Anirudh Kavya Wedding Greece: అనిరుధ్‌-కావ్యా.. గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 11, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈఓ కావ్య మారన్‌ వివాహ వేడుకలకు గ్రీస్‌ వేదికగా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా శాంటోరిని పరిసర ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. దీంతో అసలు ఈ జంట తమ పెళ్లికి గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. నిజానికి సెలబ్రిటీ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు గ్రీస్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేవరెట్‌ ప్లేస్‌గా మారింది. సముద్రం, కొండలు, తెల్లని భవనాలు, సూర్యాస్తమయ దృశ్యాలు.. ఒక పెళ్లి వేడుకకు కావాల్సిన అందం అంతా ఒకే చోట కనిపించడం దీని ప్రత్యేకత.

Details

300 రోజులు ఎండ.. పెళ్లికి పర్ఫెక్ట్‌ వాతావరణం

గ్రీస్‌లో ఏడాదిలో దాదాపు 300 రోజులు సూర్యరశ్మి ఉంటుందని చెబుతారు.

మధ్యధరా సముద్ర తీర ప్రాంత వాతావరణం కారణంగా ఆరుబయట వేడుకలు నిర్వహించుకోవడానికి అక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

ముఖ్యంగా శాంటోరిని ప్రాంతంలోని సముద్రాన్ని ఆనుకుని ఉన్న కొండ అంచులు పెళ్లి వేడుకలకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతి అందాలు మారుతూ కనిపించడం కూడా మరో ఆకర్షణ. అందుకే సెలబ్రిటీల ప్రైవేట్‌ వేడుకలకు గ్రీస్‌ మంచి ఎంపికగా నిలుస్తోంది.

Details

పెళ్లి ఫొటోలకు అదిరిపోయే బ్యాక్‌డ్రాప్

ఒక సెలబ్రిటీ పెళ్లిలో వేడుక ఎంత ముఖ్యమో ఫొటోలు కూడా అంతే ముఖ్యం.

ఈ విషయంలో గ్రీస్‌కు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. తెల్లని ఇళ్లు, నీలి సముద్రం, కొండలపై ఉన్న సంప్రదాయ నిర్మాణాలు, పురాతన కట్టడాలు.. ప్రతి ఫ్రేమ్‌ను ప్రత్యేకంగా మార్చేస్తాయి.

ముఖ్యంగా సాయంత్రం సమయంలో సూర్యుడు సముద్రంలోకి జారుకుంటున్న దృశ్యం పెళ్లి ఫొటోలకు మరింత అందాన్ని తీసుకొస్తుంది.

అనిరుధ్‌-కావ్యా వేడుకల ఫొటోలు కూడా అందుకే సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT

Details

బీచ్‌ నుంచి పర్వత గ్రామాల వరకు..

గ్రీస్‌ ప్రత్యేకత కేవలం సముద్ర తీరాలకే పరిమితం కాదు. ఒకవైపు నీలిరంగు నీటితో కనిపించే అందమైన బీచ్‌లు ఉంటే.. మరోవైపు ప్రశాంతమైన పర్వత గ్రామాలు కనిపిస్తాయి.

కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి కొంత సమయం ప్రశాంతంగా గడపడానికి ఇలాంటి ప్రదేశాలు అనువుగా ఉంటాయి.

పెళ్లి వేడుకతో పాటు అతిథులకు విహార అనుభూతి కూడా లభిస్తుంది. అందుకే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గ్రీస్‌ను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

ADVERTISEMENT

Details

ఆతిథ్యం కూడా గ్రీస్‌ ప్రత్యేకతే

గ్రీస్‌ సంస్కృతిలో అతిథులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. 'ఫిలోక్సేనియా' అనే గ్రీకు పదం అపరిచితుడిని కూడా స్నేహితుడిలా ఆదరించే భావనను సూచిస్తుంది.

అక్కడి ఆహారంలో తాజా కూరగాయలు, సీ ఫుడ్‌, మాంసాహార వంటకాలతో పాటు శాకాహార ఎంపికలు కూడా ఉంటాయి.

స్థానిక పానీయాలు, సంప్రదాయ వంటకాలు వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.

అనిరుధ్‌-కావ్యా వివాహానికి ప్రముఖులు హాజరవుతున్నారనే వార్తల నేపథ్యంలో.. ఈ వేడుక కోసం మారన్‌ కుటుంబం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నాలుగు ప్రత్యేక విమానాల ఏర్పాటుపై కూడా ప్రచారం జరుగుతోంది. విమానాశ్రయంలో రజనీకాంత్‌, ఎం.కె. స్టాలిన్‌ కనిపించిన దృశ్యాలు వైరల్‌ కావడంతో ఈ పెళ్లిపై ఆసక్తి మరింత పెరిగింది.

ADVERTISEMENT