Anirudh - Kaavya Maran: అనిరుధ్-కావ్యా మారన్ పెళ్లి వార్తలు మళ్లీ వైరల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'అఖండ 2' నటుడు
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా తమిళ సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. అనిరుధ్ వ్యక్తిత్వం, కావ్యా మారన్ వ్యాపార నైపుణ్యాల గురించి ఆయన వెల్లడించిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వై.జి. మహేంద్రన్, అనిరుధ్ వివాహంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్ ఎంతో మృదుస్వభావి, ప్రతిభావంతుడైన యువకుడని ప్రశంసించిన ఆయన, ఏదో ఒక కారణం వల్ల ఇప్పటివరకు పెళ్లి జరగలేదని అన్నారు.
వివరాలు
ఆ జోడీని అభినందించిన మహేంద్రన్..
అయితే ఆ అడ్డంకులు త్వరలో తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనిరుధ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడతాడని తాను విశ్వసిస్తున్నానని, అతనికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తాను కూడా వినిపిస్తున్న సమాచారాన్ని బట్టే ఈ విషయాన్ని చెబుతున్నానని స్పష్టం చేసిన మహేంద్రన్, ఈ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అనిరుధ్, కావ్యా మారన్ ఇద్దరూ కలిసి మంచి జంటగా కనిపిస్తారని, వారి జోడీ అభిమానులను ఆకట్టుకుంటుందని ఆయన అభినందించారు.
వివరాలు
కావ్యా మారన్ పై ప్రశంసలు..
కావ్యా మారన్ గురించి కూడా వై.జి. మహేంద్రన్ ప్రశంసలు కురిపించారు. ఆమె కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని నిర్వహించడం మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని అన్నారు. కళానిధి మారన్ నుంచి వచ్చిన వ్యాపార దూరదృష్టి, నాయకత్వ లక్షణాల వల్లే ఆమె ఐపీఎల్ జట్టును సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. గతంలో కావ్యా మారన్ సన్ టీవీ ఓటీటీ విభాగానికి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకసారి ప్రాజెక్ట్ ప్రతిపాదనతో ఆమెను కలిసినప్పుడు ఎంతో మర్యాదగా స్వాగతించి, కథలు నచ్చడంతో ఒకేసారి ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని వెల్లడించారు.
వివరాలు
మరోసారి హాట్ టాపిక్‌గా వివాహ వార్తలు..
అనంతరం కొన్ని కారణాల వల్ల ఆ ఓటీటీ ప్రాజెక్టులు నిలిచిపోయినప్పటికీ, వ్యక్తిగతంగా కావ్యా మారన్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. ఈ సందర్భంగా సరదాగా స్పందించిన మహేంద్రన్, స్టార్ సంగీత దర్శకుడిగా అనిరుధ్, వ్యాపార రంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న కావ్యా మారన్ కలిసి భవిష్యత్తులో "మ్యూజికల్ బిజినెస్" చేయొచ్చంటూ చమత్కరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో అనిరుధ్-కావ్యా మారన్ వివాహ వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్..
త్వరలో అనిరుధ్-కావ్య పెళ్లి.. కన్ఫామ్ చేసిన నటుడు!
— ChotaNews App (@ChotaNewsApp) June 27, 2026
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా మారన్ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయ్యే నటుడు వైజీ మహేంద్రన్ వీరిద్దరి రిలేషన్‌ను… pic.twitter.com/OITxYi13Po