LOADING...
Kavya Maran- Anirudh Ravichander: సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్..?
కావ్య మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్..?

Kavya Maran- Anirudh Ravichander: సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ అందరికీ సుపరిచితుడే. అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ అతను ఎవరిని వివాహం చేసుకుంటున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఆయన సన్ రైజర్స్ హైదరాబాద్‌ యజమాని కావ్య మారన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కావ్య మారన్‌ భారతదేశంలోని ప్రముఖ బిలియనీర్ మీడియా మేధావి కళానిధి మారన్‌ కుమార్తె. కళానిధి మారన్‌ సన్ గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా రు. సన్ గ్రూప్‌ దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థలలో ఒకటిగా పేరుగాంచింది. అంతేకాకుండా ఆయన నిర్మాణ రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

వివరాలు 

"అనిరుధ్ ప్లాన్ అదిరింది"

ఇలాంటి వారసత్వంతో ఉన్న కావ్యను అనిరుధ్ వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు "అనిరుధ్ ప్లాన్ అదిరింది" అంటూ స్పందిస్తున్నారు. అయితే మరోవైపు కొంతమంది ఈ వార్తలన్నీ నిరాధారమైన పుకార్లేనని ఖండిస్తున్నారు. ఇదిలా ఉండగా, అనిరుధ్‌ బృందం ఈ రూమర్లపై స్పందించి, మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో అసలు నిజం లేదని స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ సినిమాల విషయానికొస్తే.."జైలర్","దేవర","జవాన్","3" వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

వివరాలు 

రజినీకాంత్,లోకేష్ కనగరాజ్‌ల కూలీ" చిత్రానికి సంగీతం 

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ పరిశ్రమలోనూ అనేక పెద్ద హీరోల సినిమాలకు సంగీతం అందించి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్,లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న "కూలీ" చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అంతేకాకుండా "కింగ్‌డమ్", "మదరాసి", "లవ్ ఇన్సురెన్స్" వంటి చిత్రాలపై కూడా పనిచేస్తున్నారు.