
Coolie : 'కూలీ'లో మరో మాస్ ఎలిమెంట్.. కమల్ హాసన్ ఎంట్రీతో హైప్ డబుల్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమాపై రోజురోజుకీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు అదిరిపోయే స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించనున్నట్టు ఇప్పటికే తెలుస్తోంది. వీరిదీ కేవలం గెస్ట్ రోల్స్ కాకుండా కథలో కీలక మలుపులు తిప్పే పాత్రలు కావడం సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పుడు మరో పెద్ద అప్‌డేట్ ఫిలింనగర్‌ను వేడెక్కిస్తోంది.
Details
కూలీ సెన్సేషనల్ గా మారే అవకాశం
లోకనాయకుడు కమల్ హాసన్ 'కూలీ'కు వాయిస్ ఓవర్ అందించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల 'విక్రమ్' చిత్రంలో కమల్-లోకేష్ కాంబినేషన్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. లోకేష్ అడగగానే కమల్ వెంటనే ఓకే చెప్పినట్లు టాక్. గతంలో రజినీ-కమల్ కలిసి పలు చిత్రాల్లో నటించినా, ఈసారి స్క్రీన్‌పై కాకుండా కమల్ వాయిస్ రూపంలో రజినీ సినిమాలో భాగం కావడం అభిమానులను భారీగా ఆకట్టుకుంటోంది. ఇది కేవలం ఓ వాయిస్ ఓవర్ మాత్రమే కాకుండా రజినీ-కమల్ మధ్య ఉన్న స్నేహానికి అద్దంపట్టేలా మారనుంది. రజినీ మాస్, కమల్ క్లాస్, లోకేష్ మార్క్ మేకింగ్ కలవడంతో 'కూలీ' చిత్రం ఓ సెన్సేషనల్ సినిమాగా అవతరించే అవకాశం ఉంది.