తదుపరి వార్తా కథనం

Pushpa-2: సస్పెన్స్ పెంచుతున్న పుష్ప-2.. మరో స్టార్ హీరో ఎంట్రీ..?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 30, 2024
04:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ 'పుష్ప 2' కోసం అభిమానులు ఎంతో ఆతృతుగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, హీరోగా అల్లు అర్జున్ నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.
తాజాగా పుష్ప-2 గురించి మరో వార్త వైరల్ అయింది.
Details
డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్
పుష్ప 2 సినిమా చివర్లో మూడో పార్ట్ గురించి డైరక్టర్ సుకుమార్ ఓ అదిరిపోయే లీడ్ ఇవ్వనున్నట్లు సమాచారం.
క్లైమాక్స్‌లో ఓ పాపులర్ స్టార్ ఎంట్రీ ఇస్తారని, అది మూడో పార్ట్‌కు లీడ్‌గా మారుతుందని ప్రచారం సాగుతోంది.
దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.