Page Loader
My3 Arts : లండన్‌లో అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి.. కారణమిదే!
లండన్‌లో అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి.. కారణమిదే!

My3 Arts : లండన్‌లో అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి.. కారణమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2024
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా, ఐ ఆండ్ర, బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్& My3 ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించి ఆసక్తికర సమాచారం వెలువడింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'ఆండ్రూ బాబు' ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేయడం ద్వారా తన టెక్నికల్ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ చిత్రంలో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇందులో శివ కందుకూరి, అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లండన్ గణేష్, ప్రవీణ్ రెడ్డి వూట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సితార ఫిల్మ్స్ లిమిటెడ్ ద్వారా లైన్ ప్రొడక్షన్‌ను నిర్వహిస్తోంది.

Details

త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్

సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌‌గా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం లండన్‌లో అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుతున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు 'స్పైన్ చిల్లింగ్' థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, డిఆర్‌కె కిరణ్ ఆర్ట్ డైరెక్టర్, రియల్ సతీష్ స్టంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో శివ కందుకూరి, అనూ ఇమ్మాన్యుయేల్‌తో పాటు, హాస్యనటులు వైవా హర్ష, వెన్నెల కిషోర్, ఎస్ నివాసిని, షకలక శంకర్, మహేంద్ర నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు, అప్పుడే సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు.