LOADING...
Bhogi: 'భోగి' నుంచి అనుపమ ఫస్ట్ లుక్.. 'కందుల సులోచన రాణి'గా కొత్త అవతారం
'భోగి' నుంచి అనుపమ ఫస్ట్ లుక్.. 'కందుల సులోచన రాణి'గా కొత్త అవతారం

Bhogi: 'భోగి' నుంచి అనుపమ ఫస్ట్ లుక్.. 'కందుల సులోచన రాణి'గా కొత్త అవతారం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 30, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ , మాస్ డైరెక్టర్ సంపత్ నంది కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా భోగి. తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె 'కందుల సులోచన రాణి' అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో మెప్పించిన అనుపమ, ఈ సినిమాలో మాత్రం ఇస్తర్లు కుట్టుకుంటూ జీవనం సాగించే ఒక సహజమైన పల్లెటూరి అమ్మాయిగా రా అండ్ రస్టిక్ లుక్‌లో దర్శనమివ్వడం ప్రత్యేకంగా నిలుస్తోంది.

వివరాలు

కెరీర్‌లో సరికొత్త పాత్ర..

1960ల కాలానికి చెందిన తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంతో కథ సాగుతుండగా, ఇందులో అనుపమ పాత్ర సహజత్వంతో పాటు గంభీరతను కలిగి ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఆమె వేషధారణ, కట్టుబొట్టు ఆ కాలం నాటి గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్నాయి. ఈ పాత్ర కోసం అనుపమ తన మేకప్‌తో పాటు శరీర భాషలో కూడా గణనీయమైన మార్పులు చేసుకున్నట్లు సమాచారం. సంపత్ నంది శైలిలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన పల్లెటూరి నేపథ్యం ఉండటం వల్ల, ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ఒక కీలక మలుపుగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

వివరాలు

ఆగస్టు 28న రిలీజ్

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు అనుపమ లుక్ కూడా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా డింపుల్ హయతి నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 'భోగి' చిత్రం 2026 ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement