
Anushka Shetty: అనుష్క శెట్టి-క్రిష్ సినిమాకి క్రేజీ టైటిల్.. అదేంటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తో మంచి హిట్ అందుకున్న అనుష్క శెట్టి,తన తర్వాతి సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయనుందని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.
ఈ సినిమాలో అనుష్కకు జంటగా తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటిస్తున్నాడని తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తోంది.
తాజా,సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ చిత్రానికి మేకర్స్ శీలవతి అనే పేరు పెట్టినట్లు సమాచారం.
ఈ టైటిల్ సినిమా ఎమోషన్స్, డ్రామాతో ఉండబోతోంది.
రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్‌ను నిర్మిస్తున్నారు. రెండవ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.
Details
ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ పవన్ తో సినిమా
దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో హరి హర వీర మల్లు సినిమా చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ తన రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా వాయిదా పడింది.
దింతో, క్రిష్ తన సమయాన్ని వృథా చేయకుండా అనుష్క శెట్టితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ పవన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శీలవతిగా అనుష్క శెట్టి
Buzz: #AnushkaShetty - #Krish New Movie Titled as #SEELAVATHI ✅ pic.twitter.com/uYOGnq18SM
— GetsCinema (@GetsCinema) February 16, 2024