LOADING...
Kingdom: 'కింగ్డమ్‌' టికెట్‌ ధరల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం .. ఎంతంటే?
'కింగ్డమ్‌' టికెట్‌ ధరల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం .. ఎంతంటే?

Kingdom: 'కింగ్డమ్‌' టికెట్‌ ధరల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం .. ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా యాక్షన్‌ చిత్రం 'కింగ్డమ్‌' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించి టికెట్ ధరలు పెంచేలా అనుమతి కోరింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలయ్యే రోజు నుండి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.75 (జీఎస్టీతో కలిపి) వరకు అదనంగా ఛార్జ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.