LOADING...
AR Rahman: AI-ఆధారిత ప్రాజెక్ట్ 'సీక్రెట్ మౌంటైన్' కోసం.. ఓపెన్‌ ఏఐ సీఈఓను కలిసిన సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్
AI-ఆధారిత ప్రాజెక్ట్ 'సీక్రెట్ మౌంటైన్' కోసం.. ఓపెన్‌ ఏఐ సీఈఓను కలిసిన సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్

AR Rahman: AI-ఆధారిత ప్రాజెక్ట్ 'సీక్రెట్ మౌంటైన్' కోసం.. ఓపెన్‌ ఏఐ సీఈఓను కలిసిన సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ను కలిశారు. ఓ ప్రత్యేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రాజెక్టు నేపథ్యంలో ఇద్దరూ సమావేశమయ్యారని రెహమాన్‌ తెలిపారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. శామ్‌ ఆల్ట్‌మన్‌ తన కార్యాలయానికి వచ్చి కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని రెహమాన్‌ పేర్కొన్నారు. 'సీక్రెట్ మౌంటైన్‌' అనే వర్చువల్ గ్లోబల్ బ్యాండ్‌ గురించి వీరిద్దరూ చర్చించారని వెల్లడించారు. సంగీతంలో సరికొత్త ఆవిష్కరణలను సాధించేందుకు ఏఐ టూల్స్‌ వినియోగంపై విశేషంగా మాట్లాడినట్లు వివరించారు. ఈ సందర్భంలో శామ్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా రెహమాన్‌ షేర్‌ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏఆర్ రెహమాన్‌ చేసిన ట్వీట్