
అర్జున్ రెడ్డి కాంబో రిపీట్: వైరల్ అవుతున్న మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు.
అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు సందీప్.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కాంబో రిపీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఖుషి చిత్ర ప్రమోషన్లలో మాట్లాడిన మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ ఈ మేరకు కొన్ని హింట్స్ ఇచ్చారు.
Details
విజయ్ దేవరకొండతో మూడవ సినిమా ప్లాన్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామ్రేడ్, ఖుషి చిత్రాలు వచ్చాయి. మరి విజయ్ దేవరకొండ తో మూడవ సినిమా ప్లాన్ చేసే ఉద్దేశం ఉందా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు రవిశంకర్ తనదైన శైలిలో స్పందించారు.
సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక సినిమాను నిర్మించేందుకు సీరియస్ గా ట్రై చేస్తున్నామని రవిశంకర్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
అర్జున్ రెడ్డి కాంబినేషన్లో సినిమా అంటే కచ్చితంగా విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తుందని అందరికీ తెలుసు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.
ప్రస్తుతం సందీప్ వంగా బాలీవుడ్లో యానిమల్ సినిమా చేస్తున్నాడు.