Page Loader
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దాడి..ఆటో డ్రైవర్ సేవలకు రివార్డు .. ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దాడి..ఆటో డ్రైవర్ సేవలకు రివార్డు .. ఎంతంటే?

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దాడి..ఆటో డ్రైవర్ సేవలకు రివార్డు .. ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం రోజుల అయ్యింది. ఈ ఘటనలో సైఫ్‌కు ప్రాణాలు కాపాడడంలో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు. తాజాగా, అతనికి సేవలకు సంబంధించి 11,000 రూపాయల రివార్డు లభించింది. ఈ ఘటనలో నిందితుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో సైఫ్‌ అలీఖాన్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భజన్ సింగ్ అనే ఆటో డ్రైవర్ సాయం చేశాడు. షార్ట్ కట్స్ తీసుకుంటూ, సైఫ్‌ను సకాలంలో లీలావతి ఆస్పత్రికి చేర్చడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

వివరాలు 

వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకుని మనిషిని హాస్పిటల్ కి చేర్చడమే నా లక్ష్యం

ఈ ఘటనపై భజన్ సింగ్ మాట్లాడుతూ, "ఆ వ్యక్తి వీపు బాగా రక్తసిక్తమైంది. అతను సైఫ్ అలీఖాన్ అని కూడా నాకు తెలియదు. రిక్షా దిగి, లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడు అతని ముఖం చూశాను. అప్పుడు నాకు తెలిసింది. అది ఎవరైనా నేను వీలైనంత వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.. వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకుని మనిషిని హాస్పిటల్ కి చేర్చడమే నా లక్ష్యం. నేను అలానే చేసాను. సైఫ్ అలీఖాన్ ఆ రోజు తెల్లటి దుస్తులు ధరించాడు. అతని సహాయకుడు, కుమారుడు తైమూర్ మాత్రమే సైఫ్ తో ఉన్నారు'అని భజన్ సింగ్ చెప్పుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న భజన్ సింగ్