
బేబీ సినిమా హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో, హిరోయిన్ ఎవరో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబి, టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది.
ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబి ఇప్పుడు బాలీవుడ్ లోనూ రీమేక్ కు సిద్ధమవుతోంది.
ఈ చిత్రాన్ని హిందీలోనూ సాయి రాజేష్ డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.బాబీ డియోల్ కుమారుడు ఆర్యమాన్ లీడ్ రోల్ చేయనున్నారట.
హీరోయిన్ గా కొత్త అమ్మాయిని ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే, హిందీ బేబిలో సాయి రాజేష్ సహ-నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఈ మేరకు బాలీవుడ్ లో పేరు మోసిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్లు టాక్. వచ్చే ఏడాది షూటింగ్ మొదలు కానుంది.
details
హిందీతో పాటు తమిళ భాషల్లోనూ బేబి సినిమా రీమేక్
బేబి కథ పరంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. బేబి సినిమాను హిందీతో పాటు తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు సాయి రాజేశ్ గతంలో తెలిపారు.
అయితే ఉత్తరాది వాసుల అభిరుచికి తగ్గట్లుగా కథలో మార్పులు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నామని రాజేశ్ తెలిపారు.
ఇది యువత నేపథ్యంలో సాగే స్టోరీ కనుక అన్ని భాషల్లోనూ హిట్ అవుతుందని చిత్ర నిర్మాణ బృందం నమ్ముతోంది. బేబిని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN నిర్మిచారు.
సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 14న థియేటర్లో సంచలన సృష్టించింది. బేబీ సినిమా బాగుందని చిరంజీవి చిత్రబృందాన్ని అభినందించారు.