Page Loader
Harshaali Malhotra: 'భజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీకి బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్!
'భజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీకి బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్!

Harshaali Malhotra: 'భజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీకి బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయిజాన్' చిత్రంలో మున్నీగా తన హృద్య నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన హర్షాలీ మల్హోత్రా, ఇప్పుడు భారీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా 'అఖండ 2'లో ఈ బాలనటి కీలక పాత్రలో నటించబోతోందని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో హర్షాలీ 'జనని' అనే పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. 'భజరంగీ భాయిజాన్' అనంతరం కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న హర్షాలీ, ఈసారి నందమూరి బాలకృష్ణ వంటి మాస్ హీరోతో కలిసి తెలుగు తెరపై కనిపించనుండటం ఆమె అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Details

బాలకృష్ణకు జోడిగా సంయుక్తా మీనన్

'అఖండ 2'లో ఆమె పాత్రకు సంబంధించి ఇప్పుడే పెద్దగా వివరాలు వెల్లడించకపోయినా, బాలయ్యతో ఆమె సీన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా సంయుక్తా మీనన్, అలాగే మరో కీలక పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి విశేష స్పందన లభించగా, రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధిస్తోంది. మాస్, సెంటిమెంట్, యాక్షన్ మిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్