LOADING...
Balakrishna: బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్.. మాస్ ప్రేక్షకులకు పండుగ
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్.. మాస్ ప్రేక్షకులకు పండుగ

Balakrishna: బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్.. మాస్ ప్రేక్షకులకు పండుగ

వ్రాసిన వారు Moogati Shabari
May 01, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మరో భారీ మాస్ కాంబినేషన్ అధికారికంగా ఖరారైంది. హీరోగా బాలకృష్ణ, దర్శకుడిగా కొరటాల శివ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను 'NBK 112'గా అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ ప్రత్యేకతైన సామాజిక అంశంతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

వివరాలు

బాలకృష్ణ సరసన నయనతార..

"అధికారానికి ఉద్దేశం కలిసితే అది ఉద్యమంగా మారుతుంది" అనే బలమైన సందేశంతో విడుదల చేసిన కొటేషన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే కథా రచన పూర్తి చేశారని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా, బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. 'వీరసింహారెడ్డి' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement