LOADING...
Balakrishna : క్రిష్ తో బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?
Balakrishna : క్రిష్ తో బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?

Balakrishna : క్రిష్ తో బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం "అఖండ 2" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ప్రాజెక్టు అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తాజాగా ఆయన మరో చిత్రానికి కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈసారి దర్శకుడు క్రిష్ అని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, డైరెక్టర్ క్రిష్ గతంలో పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న "హరిహర వీరమల్లు" సినిమా నుంచి మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి వ్యక్తిగతంగా, అలాగే ప్రొఫెషనల్ పరంగా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్లలో వెల్లడించారు.

వివరాలు 

క్రిష్,బాలకృష్ణ కాంబోలో 3 సినిమాలు 

ప్రస్తుతం క్రిష్ అనుష్కతో కలిసి"ఘాటీ" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత, క్రిష్ మరోసారి బాలకృష్ణతో చేతులు కలిపే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి "గౌతమిపుత్ర శాతకర్ణి,""ఎన్టీఆర్ కథానాయకుడు," అలాగే "ఎన్టీఆర్ మహానాయకుడు" వంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్లీ ఒక ప్రాజెక్ట్‌ కోసం రెడీ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

కీలక పాత్రలో బాలకృష్ణ కుమారుడు

ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించి, ఇది "ఆదిత్య 369"కి సీక్వెల్ కావచ్చని గట్టిగా ప్రచారం సాగుతోంది. బాలయ్య కెరీర్లో పెద్ద హిట్ అయిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ తీస్తానని గతంలో అనేకమార్లు చెప్పారు ఈ సీక్వెల్‌కి "ఆదిత్య 999" అనే టైటిల్ ఖరారు చేసినట్టు, ఇందులో తనయుడు కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టు బాలయ్య వెల్లడించారు. ఆ సినిమానే క్రిష్ డైరెక్ట్ చేస్తాడని వినిపిస్తుంది. అయితే ఈ విషయాలపై అధికారికంగా ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.