
Akhanda 2 : అఖండ-2 క్లైమాక్స్‌లో బాలయ్య vs సంజయ్ దత్.. థియేటర్లలో గూస్‌బంప్స్ గ్యారెంటీ!
ఈ వార్తాకథనం ఏంటి
'అఖండ 2'పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ గురించి ఫిలింనగర్‌లో గాసిప్స్ ఊపందుకున్నాయి. తొలి భాగంలో అఘోర అవతారంలో బాలకృష్ణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక సీక్వెల్‌లో మాత్రం ఆయన పూర్తి స్థాయి శివుడి రూపంలో కనిపించి, ఉగ్రరూపంతో విలన్లను చంపే క్లైమాక్స్ సీన్ హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ఈ ఎపిక్ ఎపిసోడ్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారట. థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ ఫైట్ సీక్వెన్స్‌కు అదనపు హంగులు జోడించి, థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. బాలయ్య శివతాండవం స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చి, త్రిశూలం, ఢమరుకం పట్టుకుని శత్రువులను ఎదుర్కొనే సన్నివేశం ఫ్యాన్స్‌ను మంత్ర ముగ్ధులను చేయనుందట.
Details
పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలని బోయపాటి ప్లాన్
ఈ క్లైమాక్స్ కోసం స్పెషల్ వీఎఫ్‌ఎక్స్ టీమ్ ప్రత్యేకంగా గ్రాఫిక్స్ రూపొందిస్తున్నారని సమాచారం. అఖండ-2 కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా, బలమైన పొలిటికల్ టచ్‌తో కూడిన కథగా కూడా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తారని, ఒకవైపు శివభక్తుడిగా - అఘోర లుక్‌లో ధర్మం కోసం పోరాడుతుండగా, మరోవైపు ప్రజలకు సేవ చేసే పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు పాత్రలు కథలో ఎలా మిళితమవుతాయనేది సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దానికోసం బాలయ్య స్వయంగా హిందీలో డబ్బింగ్ చేసి, ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని నిర్ణయించుకున్నారని టాక్.