Rajinikanth: రజనీకాంత్ తనయుడిగా బసిల్ జోసెఫ్? కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న మలయాళ నటుడు బసిల్ జోసెఫ్, 'సూక్ష్మదర్శిని', 'పొన్‌మ్యాన్' వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 'తలైవా 173' (ప్రస్తుతం వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. తాజాగా బసిల్ చెప్పిన మాటలు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. ఒక కార్యక్రమంలో పాల్గొన్న బసిల్ జోసెఫ్ తన రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. తమిళంలో ఒక పెద్ద సినిమాలో నటించబోతున్నానని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముందని తెలిపారు. దీంతో ఆయన చెప్పింది 'తలైవా 173' గురించేనని అభిమానులు భావిస్తున్నారు.
వివరాలు
కోలీవుడ్‌లో జోరుగా చర్చలు..
ఈ సినిమాలో బసిల్ జోసెఫ్ రజనీకాంత్‌కు కుమారుడి పాత్రలో నటించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ కెరీర్‌లో 173వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. 'డాన్' సినిమాతో గుర్తింపు పొందిన శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూపర్‌హీరో చిత్రం 'మిన్నల్ మురళి'తో తన ప్రతిభను నిరూపించిన ఆయన, అల్లు అర్జున్‌తో సూపర్‌మ్యాన్ శైలిలో ఓ సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అల్లు శిరీష్ వివాహ వేడుకకు బసిల్ హాజరుకావడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందనే చర్చ సినీ వర్గాల్లో జరిగింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.