
Bhairavam : ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన 'భైరవం'.. ఎప్పుడు ఎక్కడంటే.?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు పొందిన ZEE5 తన వీక్షకులకు నిరంతరం నాణ్యమైన వినోదాన్ని అందించడంలో ముందుంటుంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన ఒరిజినల్ చిత్రాలు, వెబ్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ప్లాట్‌ఫామ్, తాజాగా మరో విభిన్నమైన సినిమాతో మన ముందుకొస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'భైరవం' అనే యాక్షన్ డ్రామా మూవీని విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టింది. ఈ సినిమాలో ఆదితి శంకర్, దివ్యా పిళ్లై,ఆనంది కీలక పాత్రల్లో నటించారు.
వివరాలు
తెలుగు, హిందీ భాషల్లో 'భైరవం' ఓటీటీ స్ట్రీమింగ్
థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన ఈ సినిమాలోని ప్రధాన తారలైన బెల్లంకొండ శ్రీనివాస్,మంచు మనోజ్, నారా రోహిత్‌ల నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వారి అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమా జూలై 18న ZEE5లో విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లో విజయాన్ని సాధించిన 'భైరవం' ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే దిశగా సాగుతోంది.
వివరాలు
జూలై 18న నుండి ZEE5లో..
కథ విషయానికి వస్తే.. విలువైన వెయ్యి కోట్ల రూపాయల విలువ గల వారాహి అమ్మవారి ఆలయ భూములపై ఒక రాజకీయ నాయకుడు కన్ను వేయడం, ఆ భూములను రక్షించేందుకు ఒక ధర్మకర్త చొరవ తీసుకోవడం, ఆ దిశగా ముగ్గురు యువకులు ఏకమై చేసే పోరాటం చుట్టే సినిమా కథ తిరుగుతుంది. ఈ ముగ్గురు నాయకుల పాత్రలు ఎలా ముందుకెళ్తాయి? ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారు? చివరకు ఏమవుతుంది? అన్నది ఉత్కంఠను కలిగించేలా ఉంటుంది. ఈ చిత్రానికి హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా,శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ యాక్షన్, డ్రామా, ఎమోషన్‌తో నిండి ఉన్న చిత్రాన్ని జూలై 18న నుండి ZEE5లో తప్పకుండా వీక్షించండి!