
Subhashree Bigg Boss: పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి అవకాశం వరిస్తుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి రాత్రికి రాత్రే కొంతమంది జీవితాలు మారిపోతాయి.
పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పలు సీరియల్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
తన ఆటలో అందరిని ఆమె మెప్పించినా, ఐదో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
ఇప్పుడు బిగ్ బాస్ నుండి బయటికి రాగానే ఏకంగా ఆమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాలో శుభశ్రీకి అవకాశం వచ్చింది.
Details
సంతోషం వ్యక్తం చేసిన శుభ శ్రీ
ఈ సినిమాలో శుభ శ్రీ ఓ పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
దర్శకుడు సుజిత్‌తో కలిసి దిగిన ఫోటోని పంచుకుంటూ తన ఆనందాన్ని శుభ శ్రీ వెల్లడించింది.
పవన్ కళ్యాన్ తో కలిసి 'ఓజీ' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని, తాను పక్కా పవర్ స్టార్ అని శుభ శ్రీ పేర్కొంది.
తన టాలెంట్‌ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన సుజిత్, కెమెరామెన్ రవిచంద్రన్, డీవీవీ దానయ్యలకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.