Page Loader
బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌
ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌

బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 21, 2023
07:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మందిని ఆకట్టుకున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు సెప్టెంబ‌ర్ 3 నుంచి సీజ‌న్ 7 ప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పటికే బిగ్ బాస్ షో ఆరు సీజ‌న్లను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుందని బాగా ప్రచారం జరుగుతోంది. అయితే బిగ్‌బాస్ షో తెలుగు తొలి సీజ‌న్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. రెండో సీజ‌న్‌కు హిరో నాని హోస్ట్ పాత్ర పోషించారు. ఇక మూడో సీజ‌న్ నుంచి కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 7వ సీజ‌న్‌కు కింగ్ నాగ్ హోస్ట్‌గా ఉండనున్నారు.

DETAILS

మీ ఆలోచ‌న‌ల‌ను ఉల్టాపుల్టా చేసే సీజ‌న్‌ అంటూ ప్రోమో

బిగ్‌బాస్ 7కు సంబంధించి ఉల్టాఫుల్టా అంటూ ఇటీవ‌లే ఓ టీజ‌ర్‌ను రిలీజ్ చేసింది.దీంతో ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. గ‌త కొన్ని సీజ‌న్లుగా బిగ్‌బాస్ షో సెప్టెంబ‌ర్ తొలివారంలోనే మొదలవుతూ వస్తోంది. తాజాగా సీజన్లోనూ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవడం విశేషం. బిగ్‌బాస్ రెవ‌ల్యూష‌న్‌కు అంతా సిద్ధంగా ఉండండి ఇది అంతం కాదు, మీ ఆలోచ‌న‌ల‌ను ఉల్టాపుల్టా చేసే సీజ‌న్‌. దీనికి మీరు రెడీనా అంటూ సాగిన ప్రోమోను మరోసారి పోస్ట్ చేశారు. శోభితశెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీపండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్లు శ్వేతా, నిఖిల్, బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, కార్తీక దీపం మోనిత‌, ప్ర‌భాక‌ర్ లాంటి వారు సంద‌డి చేయ‌నున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది.