LOADING...
Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ 9 గ్రాండ్ లాంఛింగ్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే? 

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ 9 గ్రాండ్ లాంఛింగ్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెలివిజన్ ప్రేక్షకుల ఇష్టమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఈ షో తొమ్మిదో సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్‌ 7న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుందని ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ సీజన్‌లో కూడా, షో హోస్ట్ గా కింగ్ నాగార్జుననే కొనసాగనున్నారు.

వివరాలు 

 సాంప్రదాయానికి భిన్నంగా,ప్రత్యేకంగా ప్రోమో రూపొందించారు

ఈ సారి షోను మరింత స్పెషల్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టాస్కులు, గేమ్స్ వంటి అంశాల్లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రోమోను కూడా సాంప్రదాయానికి భిన్నంగా, ప్రత్యేకంగా రూపొందించారని వెల్లడించబడింది. ఇది 9వ సీజన్ కావడంతో, ప్రోమోలో నవగ్రహాల సన్నివేశాలను చూపించారని తెలుస్తోంది. అదనంగా, ఈ సారి రెండు వేరే హౌస్‌లు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఒక హౌస్ సెలబ్రిటీలు కోసం, మరొకటి కామన్ మాన్ కోసం ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. అలాగే బిగ్‌బాస్‌ ను కూడా మారుస్తున్నట్లు చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అంటే బిగ్‌బాస్‌ వాయిస్‌ మారొచ్చని తెలుస్తోంది. అంటే, షోలో అనేక విధమైన కొత్త మార్పులు, సరికొత్త అనుభూతులను ప్రేక్షకులు ఆస్వాదించబోతోన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టార్ మా చేసిన ట్వీట్