Page Loader
Yuvraj Singh Biopic: సిల్వర్ స్క్రీన్ పై సిక్సుల వీరుడిబయోపిక్ ..  

Yuvraj Singh Biopic: సిల్వర్ స్క్రీన్ పై సిక్సుల వీరుడిబయోపిక్ ..  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2024
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితంపై ఓ సినిమా తెరకెక్కనుంది.ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరో నిర్మాత రవి భాగ్‌చంద్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూషణ్, రవి ఇటీవల యువరాజ్‌ను కలిశారు.వాటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో పోరాడి తనను తాను మళ్లీ మైదానంలోకి తీసుకువచ్చిన ఈ ఆటగాడి కథ చాలా స్ఫూర్తిదాయకం.

వివరాలు 

యువరాజ్ సింగ్ పాత్రను ఎవరు పోషిస్తారు? 

యువరాజ్ బయోపిక్ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. మీడియా కథనాల ప్రకారం, యువరాజ్ పాత్ర కోసం రణబీర్ కపూర్ ను ఎంపిక చేసే ఆకాశం ఉంది. అయితే, తన బయోపిక్ తీస్తే సిద్ధాంత్ చతుర్వేది తన పాత్రను పోషించాలని యువరాజ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. భారత్ 2011లో రెండోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న బృందంలో యువరాజ్ ఒకరు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాతలతో యువరాజ్ సింగ్