LOADING...
Thandel: ఓటీటీలోకి వచ్చేసిన తండేల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!
ఓటీటీలోకి వచ్చేసిన తండేల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!

Thandel: ఓటీటీలోకి వచ్చేసిన తండేల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'తండేల్' (Thandel) ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి దూసుకుపోయిన ఈ చిత్రం, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాను చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో తొలి వంద కోట్ల గ్రాస్‌ క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. ఇక సాయిపల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వివరాలు 

నేటి నుండి స్ట్రీమింగ్‌

ఈ చిత్రాన్ని తెరపై చూసి మళ్లీ ఆస్వాదించాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ మార్చి 7న స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. చెప్పినట్లుగానే, శుక్రవారం ఉదయం నుంచి స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'తండేల్', ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల మనసులను ఎంత వరకు కదిలిస్తుందో చూడాలి.