SSMB 29: మహేశ్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్!
టాలీవుడ్ డైరెక్టర్ దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబోలో 'SSMB 29' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రారంభం కావడం మాత్రమే మిగిలింది. రాజమౌళి ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. మహేశ్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ తరువాత ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం, షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీ, నగర శివార్లలో భారీ సెట్లు సిద్ధమయ్యాయి.
రెండు భాగాలుగా చిత్రీకరణ
మొదటి షెడ్యూల్ అక్కడే జరగనుంది. తర్వాతి షెడ్యూల్ విదేశాలలో జరగవచ్చని టాక్ ఉంది. ఈ సినిమా అధికారిక ప్రకటనకి సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే సిద్ధం అయ్యాయని, ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలో తెలియజేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అనవాయితీ ప్రకారం, త్వరలోనే ప్రెస్‌మీట్ కూడా నిర్వహించనున్నారని సమాచారం. వెయ్యికోట్ల బడ్జెట్‌తో, రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.