Page Loader
Akhanda 2 : 'అఖండ-2' కోసం బోయపాటి శ్రీనుకి ఎవరూ ఊహించని రెమ్యునరేషన్
'అఖండ-2' కోసం బోయపాటి శ్రీనుకి ఎవరూ ఊహించని రెమ్యునరేషన్

Akhanda 2 : 'అఖండ-2' కోసం బోయపాటి శ్రీనుకి ఎవరూ ఊహించని రెమ్యునరేషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ, బోయ‌పాటి శ్రీనుల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్‌గా నిలిచింది. సింహ‌, లెజెండ్, అఖండ‌ వంటి చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ 'అఖండ‌-2'తో డబుల్ హ్యాట్రిక్ సాధించడానికి రెడీ అవుతున్నారు. అఖండ-2 మొదటి సారి పాన్ ఇండియా లెవల్లో వస్తోంది. ఎందుకంటే 'అఖండ'కు హిందీలో అద్భుత స్పందన లభించింది. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తీసేందుకు బోయ‌పాటి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు బోయ‌పాటిని భారీ పారితోషికం తీసుకోనున్నారు. రూ.22 కోట్లు పారితోషికంగా తీసుకోవడం ఆయన కెరీర్‌లో అత్యధికం.

Details

సమర్పకురాలిగా బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీ

ఇంతవరకు ఆయన 10 కోట్ల వరకు మాత్రమే తీసుకున్నారు, కానీ ఈ సినిమాలో రెట్టింపు పారితోషికం తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి బాల‌య్య కుమార్తె తేజ‌స్వీ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. రామ్ అచంట-గోపీ అచంట నిర్మాతలుగా పని చేస్తున్నారు. 'అఖండ' హ‌క్కులు నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి తీసుకున్నప్పటికీ, ఈ సెకండ్ పార్ట్‌ను కొత్త నిర్మాతలు నిర్మిస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌ను కొనసాగిస్తున్నారు, ఆయన గతంలో 'అఖండ'కి సంగీతం అందించారు.