
బ్రో సినిమా సరికొత్త ప్రమోషన్: హీరోల కటౌట్స్ లో అభిమానుల ఫోటోలు
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 28వ తేదీన రిలీజ్ అవుతుంది.
తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా బ్రో తెరకెక్కింది. బ్రో సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ రాయడం విశేషం.
అయితే, బ్రో సినిమా ప్రమోషన్లు ఆల్రెడీ మొదలైపోయాయి. తాజాగా బ్రో చిత్రబృందం, అభిమానులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
బ్రో సినిమా కటౌట్స్ లో అభిమానుల ఫోటోలు పెడుతున్నట్లు, అభిమానుల ఫోటోలతో కటౌట్స్ రూపొందిస్తున్నట్లు తెలియజేసి అభిమానులను ఫోటోలు పంపాలని ఒక లింక్ ఇచ్చింది.
మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఫోటోలు పంపించేయండి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫోటోలు పంపమని చిత్రబృందం చేసిన ట్వీట్
Assemble Fandom 📣
— People Media Factory (@peoplemediafcy) July 10, 2023
Here's your opportunity to get featured on your favourite #BroTheAvatar cut-outs in your region ❤️🔥
Send us your most cherished photo using the link below & we'll create & give you back a memory of a lifetime 🤗
🔗 https://t.co/2n8s7mzUih@PawanKalyan… pic.twitter.com/zR2iDo7N16