Page Loader
'రూల్స్ రంజన్' నుంచి అప్డేట్.. రేపు 'ఎందుకురా బాబు' సాంగ్ రిలీజ్
స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఎందుకురా బాబు విడుదల

'రూల్స్ రంజన్' నుంచి అప్డేట్.. రేపు 'ఎందుకురా బాబు' సాంగ్ రిలీజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 05, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

రూల్స్ రంజన్ చిత్రానికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఎందుకురా బాబు అనే పాటను ఆదివారం రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన నాలో నేనే లేను (Naalo Nene Lenu), స‌మ్మోహానుడా (Sammohanuda) పాటలకు ప్రేక్ష‌కుల‌ను నుంచి మంచి స్పందన వచ్చినట్లు వచ్చింది. ఆగ‌స్టు మొద‌టి ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా (ఫ్రెండ్‌షిప్ డే) మూడో పాటను విడుదల చేయనున్నారు. టాలీవుడ్ యువ కెరటం కిరణ్‌ అబ్బవరం, డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండగా రుథిరమ్‌ కృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు. ఆగ‌స్టు 6న మధ్యాహ్నం 1.50 గంటలకు పాటను విడుదల చేయనున్నారు. ఈ మూవీలోని పాటలకు అమ్రిష్‌ బాణీలను సమకూర్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేపు మధ్యాహ్నం మూడో సాంగ్ రిలీజ్

మీరు పూర్తి చేశారు