Loading...
Mahesh babu: మహేష్ బర్త్‌డే.. క్యూట్‌ ఫ్యామిలీ ఫొటోతో నమ్రత పోస్ట్‌..
మహేష్ బర్త్‌డే.. క్యూట్‌ ఫ్యామిలీ ఫొటోతో నమ్రత పోస్ట్‌..

Mahesh babu: మహేష్ బర్త్‌డే.. క్యూట్‌ ఫ్యామిలీ ఫొటోతో నమ్రత పోస్ట్‌..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దర్శకుడు రాజమౌళి 'వారణాసి' లుక్‌తో మహేశ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పగా.. పలువురు స్టార్‌ నటీనటులు కూడా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ కూడా ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. మహేశ్‌, నమ్రతతో పాటు పిల్లలు ఉన్న క్యూట్‌ ఫ్యామిలీ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ భర్తకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

వివరాలు

నమ్రత పోస్ట్..

''హ్యాపీ బర్త్‌డే MB. మా ప్రతి రోజును ఇంత ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్‌ యూ సో మచ్‌'' అని నమ్రత శిరోద్కర్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మహేశ్‌ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రత్యేకంగా పోస్ట్‌ చేశారు. ''మహేశ్‌ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మీరు మరెన్నో విజయాలు సాధిస్తూ ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ADVERTISEMENT