Naga Chaitanya: హైదరాబాద్ చైల్డ్ కేర్ సెంటర్‌లో చై-శోభిత సందడి!
ఈ వార్తాకథనం ఏంటి
నాగ చైతన్య, శోభిత తమ సహృదయాన్ని చాటుకున్నారు. ఈ జంట వివాహం అనంతరం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఎవరి వ్యాఖ్యలకూ స్పందించకుండా తమ జీవితాన్ని తమదైనంగా కొనసాగిస్తున్నారు.
తాజాగా శనివారం హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్‌ను సందర్శించిన వీరిద్దరూ, క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో కొద్దిసేపు గడిపారు.
చిన్నారులతో కలిసి మాట్లాడి, వారికి ధైర్యాన్ని నింపేలా ప్రేరణ ఇచ్చారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, వారితో కలిసి ఆడి పాడి, ఆనందాన్ని పంచారు.
Details
చిన్నారులకు ప్రత్యేక బహుమతులు
ఈ సందర్భంగా చైల్డ్ కేర్ సెంటర్ సిబ్బందితో మాట్లాడిన చై-శోభిత జంట, పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
ప్రత్యేకంగా అక్కడి చిన్నారులకు బహుమతులు అందించి, వారితో కలిసి ఫోటోలు దిగారు.
సంబంధిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.