
Chiru-Anil: చిరు-అనిల్ రావిపూడి మూవీ.. షూటింగ్‌కు ముహూర్తం ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా గురించి ఇప్పటికే టాలీవుడ్‌లో హైప్ నెలకొంది.
సంక్రాంతి బరిలో బ్లాక్‌బస్టర్ అందించాలని దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేయగా, సెకండ్ హాఫ్‌ను మరింత మెరుగుపరచడానికి చిన్న మార్పులు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో నయనతార కోసం ఆయన చెన్నై వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ఓ ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా షూట్ చేసినట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఈ నెల 22వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోంది.
Details
సంక్రాంతికి రిలీజ్
ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ లండన్‌లో ఉన్నారు. అక్కడి వ్యాక్స్ స్టాట్యూ లాంచింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
తిరిగి వచ్చాక, ఒక కీలక మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం షూటింగ్ షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ జరగనుంది.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించనుండగా, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
సంక్రాంతి బరిలో ఈ సినిమా పెద్ద దుమ్ము రేపేలా గట్టిగా ప్రణాళికలు జరుగుతున్నాయి.