Vijay Deverakonda: అంచనాలను పెంచుతున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ప్రీ లుక్ పోస్టర్!
'ది ఫ్యామిలీ స్టార్'కి అండర్ రెస్పాన్స్ వచ్చిన తరువాత, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నిర్మాత దిల్ రాజుతో మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోల దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం గ్రామీణ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రానికి SVC59 అనే టైటిల్ పెట్టారు.
యాక్షన్ ప్యాక్ వెంచర్ కోసం అభిమానుల ఆసక్తి
ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ లో " కత్తి నేనే...నెత్తురు నాదే...యుద్ధం నాతోనే" అనే డైలాగ్ ఉంది.ఈ యాక్షన్ ప్యాక్ వెంచర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తో పాటుగా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక చిత్రాన్ని చేస్తున్నారు విజయ్ దేవరకొండ.