
Coolie: కూలీ సినిమా ఫీవర్.. రజనీ సినిమా రోజు ఉద్యోగులకు హాలీడే ప్రకటించిన సంస్థ!
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలను పురస్కరించుకుని, ఒక సంస్థ తన ఉద్యోగులకు ప్రత్యేక గిఫ్ట్ ప్రకటించింది. గురువారం థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మద్దతుగా, తమిళనాడులోని మదురై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూనో ఆక్వా కేర్ సంస్థ, ఉద్యోగులకు సినిమా రోజు సెలవు ఇవ్వడంతో పాటు ఉచిత టికెట్లు కూడా అందించింది. ఈ సదుపాయం చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం వంటి ప్రాంతాల్లోని సంస్థ శాఖలకు వర్తిస్తుంది.
Details
సామాజిక మధ్యమాల్లో సర్క్యులర్ వైరల్
సినిమా రిలీజ్ రోజు ఉద్యోగులు మాత్రమే కాదు, సమాజానికి కూడా ఆనందం పంచాలని లక్ష్యంగా, ఆ రోజు ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, విరాళాల అందజేత, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేయాలని సంస్థ ప్రకటించింది. ఉద్యోగులకు పంపిన ఈ సర్క్యులర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ప్రేరణ పొందిన పలువురు ఉద్యోగులు తమ తమ సంస్థలను ట్యాగ్ చేస్తూ, "మాకు కూడా సెలవు ఇవ్వండి" అంటూ పోస్టులు పెడుతున్నారు.