Page Loader
Coolie : 'కూలీ' టికెట్ బుకింగ్స్ స్టార్ట్ డేట్ ఫిక్స్.. అమెరికాలో రజినీ ఫీవర్ స్టార్ట్!
'కూలీ' టికెట్ బుకింగ్స్ స్టార్ట్ డేట్ ఫిక్స్.. అమెరికాలో రజినీ ఫీవర్ స్టార్ట్!

Coolie : 'కూలీ' టికెట్ బుకింగ్స్ స్టార్ట్ డేట్ ఫిక్స్.. అమెరికాలో రజినీ ఫీవర్ స్టార్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ మాస్ మూడ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ' ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తోంది. ఈమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ముమ్మరంగా పెరిగాయి. తెలుగు,తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటికే ఈ చిత్రానికి బలమైన పాజిటివ్ హైప్ ఏర్పడింది. ప్రత్యేకించి రజినీ అభిమానులు ఆయనను మరోసారి శక్తివంతమైన యాక్షన్ గెటప్‌లో చూడనున్నారని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమాలో రజినీతో పాటు ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనుండటంతో మల్టీస్టారర్ మేజిక్ పనికొస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

Details

ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్

సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌(BGM) సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం, అమెరికాలో 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్ జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అక్కడి రజినీకాంత్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అమెరికన్ డిస్ట్రిబ్యూటర్లు పెద్ద స్క్రీన్ కౌంట్‌తో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ నేపథ్యంలో సినిమాకు వసూళ్ల పరంగా బలమైన ఓపెనింగ్స్ రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.