Devara: ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్.. 'ఆయుధపూజ' సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్న నేపథ్యంలో మొదటి భాగం భారీ బడ్జెట్‌తో ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించారు.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రికార్డు వ్యూస్ సాధించి, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపింది.
Details
ఈనెల 22న ఫ్రీ రిలీజ్ ఈవెంట్
'దేవర' నుండి ఇప్పటివరకు మూడు లిరికల్ సాంగ్స్ విడుదలయ్యాయి.
తాజాగా 'ఆయుధపూజ' లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 19న ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇదిలా ఉంటే, 'దేవర' ప్రీ సేల్స్ ఓవర్సీస్‌లో సంచలనం సృష్టిస్తోంది.
U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్‌తో వస్తోంది.
ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 22న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.